కలం, వెబ్ డెస్క్: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) జంటగా నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ ట్రైలర్ విడుదలైన విషయం తెలిసిందే. ఈ ఈవెంట్ ముంబైలో జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన జాన్వీ కపూర్ తన అద్భుతమైన స్టైలిష్ లుక్‌తో అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఐసీ బ్లూ శారీలో (Icy Blue Saree) దేవకన్యలా మెరిసిపోయింది. చీరకట్టుకు కాస్త భిన్నంగా భుజాలపై నుంచి డిజైన్ చేసిన టాసిల్డ్ దుపట్టాను ధరించింది. ఆమె చేసిన ఫ్యాషన్ ప్రయోగం ప్రశంసలు అందుకుంటోంది. ఈ లుక్‌కు తగినట్లుగా సింపుల్ మేకప్, స్టడ్ ఇయర్ రింగ్స్ ధరించి ఈవెంట్‌లోనే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రస్తుతం జాన్వీ పిక్స్ ఫ్యాషన్ ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.
బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో జాన్వీ కపూర్ (Janhvi Kapoor) కథానాయికగా నటించింది. ట్రైలర్ లాంచ్ వేదికపై జాన్వీ కపూర్ మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు. హైదరాబాద్ ఇప్పుడు తనకు రెండో ఇల్లులా అనిపిస్తోందని, సహనటుడు రామ్ చరణ్ అద్భుతమైన వ్యక్తి అని కొనియాడారు.
Read Also: ఎబోలా వైరస్ వ్యాప్తిపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ!
Follow Us On: WhatsApp

