Mobile Popup Ad
Mobile Popup Ad

ఎబోలా వైరస్ వ్యాప్తిపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ!

కలం, వెబ్ డెస్క్: ప్రాణాంతక ఎబోలా వైరస్ (Ebola Virus) ఆఫ్రికా దేశాలను మరోసారి భయకంపితులను చేస్తోంది. ఇప్పటికే కాంగో దేశంలో వేలాది కేసులు బయటపడుతుండగా.. మరణాల సంఖ్య కూడా ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే, ప్రపంచ ఆరోగ్య సంస్థ కాంగోతో పాటు చుట్టుపక్కల దేశాల్లో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది. ఈ పరిణామాల నేపథ్యంలో భారత్‌లో ఈ వైరస్ వ్యాప్తిపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ క్లారిటీ ఇచ్చింది. “ప్రస్తుతానికి దేశంలో ఒక్క ఎబోలా కేసు కూడా నమోదు కాలేదు. పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉంది. నిరంతర పర్యవేక్షణతో పాటు భవిష్యత్తు పరిస్థితులకు మంత్రిత్వ శాఖ పూర్తి సన్నద్ధతతో ఉంది. ప్రజారోగ్యాన్ని కాపాడే విషయంలో అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం” అని ఓ కీలక అధికారి పేర్కొన్నారు.

ఇది కరోనా మాదిరి కాదు: డాక్టర్‌‌ రాకేశ్ మిశ్రా

ఎబోలా వైరస్ కరోనాలా ఉండదని, అంతటి మహమ్మారి కాదని బెంగళూరులోని టాటా ఇన్ స్టిట్యూట్ ఫర్ జెనెటిక్స్ అండ్ సొసైటీ డైరెక్టర్ డాక్టర్ రాకేశ్ మిశ్రా స్పష్టం చేశారు. అవగాహన, పర్యవేక్షణ మాత్రం అవసరమని, ఎలాంటి సున్నితమైన సమాచారమైనా.. కంగారుకి గురి చేయొచ్చని వివరించారు. ఈ విషయంలో ప్రభుత్వం తీసుకునే చర్యలు చాలా ముఖ్యమైనవి చెప్పారు. ప్రస్తుతానికి ఎబోలా వైరస్‌కు కచ్చితమైన చికిత్స ఏదీ అందుబాటులో లేదని, అవగాహన కలిగి ఉంటూ.. అది రాకుండా ముందు జాగ్రత్త​లు చేపట్టడమే మన చేతుల్లో ఉంటుందని తేల్చి చెప్పారు. అయితే, కొవిడ్ మాదిరి ఇది మహమ్మారిలా విస్తరించడం మాత్రం అసాధ్యం అన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>