కలం, జనగామ: జనగామ (Jangaon) జిల్లా ధర్మసాగర్ మండలం దేవనూరు గ్రామం సమీపంలో బుధవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాత్రి సుమారు 9 గంటల సమయంలో ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
మృతులను తరిగొప్పుల మండలం నర్సాపూర్ గ్రామానికి చెందిన ఏనుగుల శివ, లోకేష్‌గా గుర్తించారు. వీరు ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. ధర్మసాగర్‌లో జరిగిన ఒక వివాహ వేడుకకు హాజరై, తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.

