విషాదం.. స్విమ్మింగ్ పూల్లో పడి తల్లీ కూతుళ్లు మృతి

కలం, వరంగల్ బ్యూరో: హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం పున్నెలు గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. స్విమ్మింగ్ పూల్లో పడి తల్లీ కూతుళ్లు (Mother and daughter die) మృతి చెందారు. పోలీసుల కథనం ప్రకారం.. పున్నెలు గ్రామానికి చెందిన మహమ్మద్ అజారుద్దీన్ తన భార్య ఫర్హాత్ (26), కూతుళ్లు ఉమేరా (8), అయేషా (7)తో కలిసి బుధవారం రాత్రి గ్రామంలోని ఓ వెంచర్ సమీపంలో ఉన్న స్విమ్మింగ్ పూల్‌లో ఈతకు వెళ్లారు. కొద్దిసేపటి తర్వాత తల్లి కూతుళ్లు పూల్లో పడి మృతి చెందారు. ఈ ఘటనపై స్థానికంగా కలకలం రేపింది. ముగ్గురు ఒకేసారి పూల్‌లో పడిపోవడానికి గల కారణాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది హత్యా? ఆత్మహత్యా? లేక ప్రమాదవశాత్తు జరిగిందా? అనే మూడు కోణాల్లో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం వరంగల్‌లోని ఎంజీఎం హాస్పిటల్ కు తరలించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>