కలం, జనగామ: జనగామ (Jangaon) జిల్లా కేంద్రంలో నిబంధనలను ఉల్లంఘిస్తూ నిర్వహిస్తున్న మాంస విక్రయ కేంద్రాలపై మున్సిపల్ అధికారులు ఆదివారం దాడులు నిర్వహించారు. నివాస ప్రాంతాలు, ఇండ్ల మధ్యలోనే అక్రమంగా వధశాలలు ఏర్పాటు చేసి వ్యాపారం చేస్తున్నట్లు గుర్తించారు. గతవారం నుంచే నిబంధనలకు విరుద్ధంగా మాంస విక్రయాలు చేయొద్దని వ్యాపారులకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అయినా కొందరు నిబంధనలు పట్టించుకోకుండా వ్యాపారం కొనసాగించడంతో తనిఖీలు చేపట్టారు.
నిబంధనలు ఉల్లంఘించిన కరణ్ మటన్ షాప్‌కు మున్సిపల్ అధికారులు రూ.1 లక్ష జరిమానా విధించారు. ఇకపై అక్రమంగా మాంస విక్రయాలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మున్సిపల్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని అధికారులు హెచ్చరించారు.
Read Also: కేసీఆర్ వస్తే లాగులు తడుపుకుంటారు.. జగదీశ్ రెడ్డి ఫైర్
Follow Us On: Instagram

