కేసీఆర్ క్యాంప్ కార్యాలయంపై దాడి హేయం : ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి

కలం, జనగామ : గజ్వేల్‌లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై జరిగిన దాడిని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి (Palla Rajeshwar Reddy)  తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనను ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా ఆయన అభివర్ణించారు. శనివారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ప్రభుత్వ ఆస్తి అని, దానిని ధ్వంసం చేయడం అంటే ప్రభుత్వ సంపదను నాశనం చేయడమేనని స్పష్టం చేశారు. ఇలాంటి చర్యలు పూర్తిగా అప్రజాస్వామికమని మండిపడ్డారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని, ఆ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు ఇలాంటి దాడులను ప్రోత్సహిస్తోందని ఆయన ఆరోపించారు. “ఒక మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికే రక్షణ లేకపోతే, సాధారణ ప్రజల భద్రత పరిస్థితి ఎలా ఉంటుంది?” అంటూ ఆయన ప్రశ్నించారు. ఈ ఘటనలో పోలీసుల పాత్రపై కూడా ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. వెంటనే బాధ్యులను గుర్తించి, కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో భౌతిక దాడుల సంస్కృతి పెరగడం ఆందోళనకరమని, ప్రభుత్వం తక్షణమే ఇలాంటి ఘటనలను అరికట్టాలని హెచ్చరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>