సింగరేణి ఉద్యోగులకు గుడ్ న్యూస్​.. సహజ మరణానికి రూ.10లక్షల ఉచిత బీమా

కలం, ఖమ్మం బ్యూరో : సింగరేణి (Singareni) ఉద్యోగులు సహజమరణం పొందినా రూ.10 లక్షల ఉచిత బీమా పథకం అమలవుతుందని యూనియన్ బ్యాంక్ వర్గాలు తెలియజేశాయి. యాజమాన్యం చొరవతో అమలు చేస్తున్న ఈ పథకం ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వస్తుందని వారు పేర్కొన్నారు. ఇప్పటివరకు సింగరేణిలో కోటి రూపాయల ప్రమాద బీమా పథకాన్ని అమలు చేస్తున్న యూనియన్ బ్యాంక్, సింగరేణి యాజమాన్యం చేసిన సూచనల మేరకు సహజ మరణం చెందిన కార్మికులకు కూడా ఉచిత బీమా సౌకర్యాన్ని కల్పించాలని నిర్ణయించింది. యూనియన్ బ్యాంకులో కార్పొరేట్ శాలరీ అకౌంటు కలిగి ఉన్న కార్మికులు లేదా అధికారులు ఎవరైనా మృతి చెందినట్లయితే వారికి పది లక్షల రూపాయల బీమా సౌకర్యాన్ని వర్తింప జేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు సింగరేణి సంస్థకు బ్యాంకు యాజమాన్యం తెలియజేసింది.

సింగరేణి (Singareni) సంస్థ ఛైర్మన్, ఎండీ డాక్టర్ బుద్దప్రకాష్ జ్యోతి ఆదేశాల మేరకు ఫైనాన్స్ డైరెక్టర్ గౌతమ్ పోట్రు ప్రత్యేక చొరవ ఫలితంగా యూనియన్ బ్యాంకు యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఇది అమలులోకి రానున్నట్లు బ్యాంకు యాజమాన్యం పేర్కొంది. 2024 లో రాష్ట్ర ప్రభుత్వం చొరవతో సింగరేణి కార్మికులకు ఉచిత కోటి రూపాయల ప్రమాద బీమా పథకాన్ని యూనియన్ బ్యాంకు అమలు చేసింది. ఈ ఒప్పందానికి కొనసాగింపుగా సహజ మరణానికి కూడా 10 లక్షల రూపాయల బీమాను వర్తింపజేస్తూ నిర్ణయించినట్లు యూనియన్ బ్యాంకు అధికారులు పేర్కొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>