Mobile Popup Ad
Mobile Popup Ad

జ‌న‌గామ చైర్మ‌న్ ఎన్నిక వాయిదా.. ఎంపీ ఒత్తిడి మేరకేనా?

కలం, జనగామ: తీవ్ర ఉద్రిక్త ప‌రిస్థితుల మ‌ధ్య జనగామ (Jangaon) మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వాయిదా ప‌డింది. మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా వేయడంపై సర్వత్రా విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. పూర్తి కోరం ఉన్నా కూడా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (Chamala Kiran Kumar Reddy) ఒత్తిడి మేరకు అధికారులు ఎన్నిక వాయిదా వేసినట్లు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

చైర్మ‌న్, వైస్ చైర్మ‌న్ ఎన్నిక కోసం ఉద‌య‌మే అన్ని పార్టీల అభ్య‌ర్థులు మున్సిప‌ల్ హాల్‌కు చేరుకున్నారు. అయితే 28వ వార్డు కౌన్సిలర్ కిడ్నాప్ అయ్యారని ఎంపీ చామల ఫిర్యాదు చేశారు. ఈ కార‌ణంగా చైర్మన్ ఎన్నిక వాయిదా వేయాలని అధికారులతో వాగ్వాదానికి దిగారు. పోడియం ముందు బైఠాయించి నిర‌స‌న తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నుంచి చైర్మన్ అభ్యర్థిగా 22వ వార్డు కౌన్సిలర్ బాలమణిని ప్రతిపాదించారు. 28వ వార్డు కౌన్సిలర్ కిడ్నాప్ కేసు దర్యాప్తు చేశాకే ఎన్నిక నిర్వహించాలని ఎంపీ చామల ప‌ట్టుబ‌ట్టారు. దీంతో ఆయ‌న డిమాండ్ మేర‌కే ఎన్నిక వాయిదా వేసిన‌ట్లు ప్ర‌తిప‌క్షాలు ఆరోపిస్తున్నాయి.

ఎమ్మెల్యే పల్లా నిరసన

కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా అధికారులు పని చేస్తున్నారని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి (Palla Rajeshwar Reddy) ఆధ్వర్యంలో బీఆర్ఎస్ కౌన్సిలర్లు మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన నిరసన తెలిపారు. చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు సరిపడా కోరం ఉన్నప్పటికీ కాంగ్రెస్ నేతలకు భయపడి ఎన్నిక వాయిదా వేశారని ఆందోళన వ్యక్తం చేశారు.

Read Also: ఏదులాపురంలో కాంగ్రెస్ హవా..

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>