ఏదులాపురంలో కాంగ్రెస్ హవా..

కలం, ఖమ్మం బ్యూరో: కాంగ్రెస్ (Congress) ఏదులాపురం (Yedulapuram) మున్సిపాలిటీలో ఘన విజయం సాధించింది. మొత్తం 32 వార్డులలో 24 స్థానాలను కైవసం చేసుకుని స్పష్టమైన ఆధిక్యం నెలకొల్పింది. ఈ ఫలితాలతో ఏదులాపురం మున్సిపాలిటీపై కాంగ్రెస్ పూర్తి పట్టు సాధించింది. మున్సిపల్ చైర్‌పర్సన్‌గా పోక బత్తిన అనిత ఎన్నికవ్వగా, వైస్ ఛైర్మన్‌గా తమ్మినేని నవీన్ ఎన్నికై బాధ్యతలు స్వీకరించారు.

మున్సిపల్ కార్యాలయంలో జరిగిన ఎన్నికల ప్రక్రియలో విజేతలకు పార్టీ నాయకులు, కార్యకర్తలు అభినందనలు తెలిపారు. పట్టణ అభివృద్ధి, మౌలిక వసతుల మెరుగుదల, పారిశుద్ధ్యం, తాగునీటి సమస్యల పరిష్కారం వంటి అంశాలకు ప్రాధాన్యత ఇస్తామని నూతన ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు.

Read Also: చైతన్యపురిలో నరబలి కలకలం!

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>