కలం, మునుగోడు : జంధ్యాల పూర్ణిమ (శ్రావణ పౌర్ణమి) పర్వదినాన్ని పురస్కరించుకుని చండూరులోని (Chandur) శ్రీ మార్కండేశ్వర స్వామి దేవాలయంలో (Sri Markandeshwara Swamy Temple) శుక్రవారం వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ఉదయం శ్రీ గాయత్రీ హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం భక్తులచే సామూహికంగా నూతన యజ్ఞోపవీత ధారణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఆలయ అర్చకులు సత్యనారాయణ పంతులు, వెంకటేశం పంతులు, రాము పంతులు, నవీన్ పంతులు ఆధ్వర్యంలో వేదమంత్రోచ్ఛారణల మధ్య పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో కొనసాగాయి.
జంధ్యాల పూర్ణిమ (Jandhyala Purnima) సందర్భంగా నిర్వహించిన హోమం, యజ్ఞోపవీత ధారణ కార్యక్రమాలతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయింది. భక్తులు భక్తిశ్రద్ధలతో పూజలలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ కార్యక్రమాలలో ఉదయ దేవాలయాల ట్రస్ట్ చైర్మన్ కోమటి వీరేశం, పద్మశాలి సంఘం గౌరవ అధ్యక్షులు పులిపాటి ప్రసన్న, అధ్యక్షులు గుర్రం బిక్షమయ్య, కోడి గిరిబాబు, 10వ వార్డు కౌన్సిలర్ కటకం రమేష్ చారి, తిరందాసు శ్రీను, రాపోలు వెంకటేశం, జూలూరు వెంకటేశం, పున్న సైదులు, ఏలే చంద్రశేఖర్, ఏలే మహేష్, గంజి గంగాధర్, మణికుమార్, బిక్షం తదితరులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై జంధ్యాల పూర్ణిమ వేడుకలను విజయవంతం చేశారు.

