తోబుట్టువుగా అండగా ఉంటా.. మహిళలకు మేఘారెడ్డి భరోసా

కలం, వనపర్తి: రాఖీ పౌర్ణమి సందర్భంగా ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి (Megha Reddy) కి నియోజకవర్గంలోని మహిళలు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు, మున్సిపల్‌ చైర్మన్లు, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేను కలిసి రాఖీలు కట్టారు. ఈ సందర్భంగా రాఖీ కట్టిన మహిళలకు ఎమ్మెల్యే చీరలు బహూకరించారు. మహిళలు తనను అన్నగా భావించి రాఖీ కట్టినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

‘‘ఇకపై మిమ్మల్ని నా తోబుట్టువులుగా భావిస్తూ ఎల్లవేళలా అండగా ఉంటా. ఏ సమస్య వచ్చినా నా దృష్టికి తీసుకురండి. పరిష్కారానికి కృషి చేస్తా’’ అని మేఘారెడ్డి భరోసా ఇచ్చారు. నియోజకవర్గంలోని ప్రతి మహిళకు పెద్దన్నగా అండగా ఉంటానని, వారి భద్రత, సంక్షేమం, గౌరవానికి ప్రాధాన్యం ఇస్తానని పేర్కొన్నారు. ఎమ్మెల్యే ఆప్యాయంగా పలకరించి చీరలు బహూకరించడం తమకు సంతోషాన్ని కలిగించిందని మహిళలు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>