నిర్మల్‌లో రాష్ట్రస్థాయి పోటీలు.. ఎన్టీఆర్ మినీ స్టేడియం రెడీ!

కలం, నిర్మల్: రాష్ట్రస్థాయి ఆట్యపాట్య అసోసియేషన్ పోటీలకు నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియం ముస్తాబవుతోంది. ఈ నెల 29, 30 తేదీల్లో నిర్వహించనున్న ఈ పోటీల్లో రాష్ట్రవ్యాప్తంగా 20 జిల్లాల నుంచి క్రీడాకారులు పాల్గొననున్నారు. క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు శుక్రవారం గ్రౌండ్‌‌ను సిద్ధం చేసే పనుల్లో నిమగ్నమయ్యారు. పోటీల కోసం మైదానాన్ని చదును చేయడంతోపాటు అవసరమైన ఏర్పాట్లు, క్రీడా వసతులను సిద్ధం చేస్తున్నారు.

రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి ప్రతిభావంతులైన క్రీడాకారులు తరలిరానుండటంతో ఎన్టీఆర్ మినీ స్టేడియంలో రెండు రోజుల పాటు క్రీడా సందడి నెలకొనబోతోంది. ఈ ఏర్పాట్లను ఆట్యపాట్య అసోసియేషన్ అధ్యక్షులు వన్నెల భూమన్న, కార్యదర్శి సంజీవ్ పరిశీలించారు. వ్యాయామ ఉపాధ్యాయులు సాయి, సురేశ్, ముఖేశ్, గిరి గ్రౌండ్‌‌ను పోటీలకు అనుగుణంగా సిద్ధం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>