సీఎస్‌తో ఎంపీ ఈటల భేటీ.. మల్కాజిగిరి అభివృద్ధిపై చర్చ

కలం, వెబ్ డెస్క్ : బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ (Eatala Rajendar) తెలంగాణ చీఫ్ సెక్రటరీ సంజయ్ జాజుతో సమావేశం అయ్యారు. మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోని అభివృద్ధి పనుల అనుమతికి సంబంధించి ఈటల శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో సీఎస్ ను కలిశారు. మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో 23 చోట్ల రైల్వే అండర్ బ్రిడ్జిలు, ఓవర్ బ్రిడ్జిల నిర్మాణానికి నిధులు మంజూరు అయ్యాయి. ఇవన్నీ రైల్వే డిపార్ట్మెంట్ నిధులతోనే నిర్మాణం జరుగుతుంది. ఇందులో ఎనిమిది చోట్ల పనులు ప్రారంభమయ్యాయి.

మిగిలినవి ప్రారంభించడానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున కొన్ని అనుమతులు పెండింగ్ లో ఉన్నాయి. వీటి పరిష్కారం కోసం సీఎస్ ను ఈటల కలిసి చర్చించారు. ట్రాఫిక్ మళ్లింపు, భూ సేకరణ, నష్ట పరిహారం చెల్లింపులు తదితర పెండింగ్ అంశాలపై సమావేవశంలో ఈటల ప్రస్తావించారు. వీటితోపాటు మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోని వివిధ మున్సిపాలిటీలలో పెండింగ్ పనులకు సంబంధించిన వివరాలను సీఎస్ దృష్టికి తీసుకొచ్చారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>