ఆలయ నిర్మాణానికి రేగుల బాలరాజు లక్ష విరాళం

కలం, వనపర్తి: భక్త మార్కండేయ స్వామి జ్ఞాన సరస్వతి దేవి ఆలయ నిర్మాణానికి విరాళాల సేకరణ కొనసాగుతోంది. ఇందులో భాగంగా వనపర్తికి (Wanaparthy) చెందిన రేగుల బాలరాజు (పాతబజార్ చిన్న) ఆలయ నిర్మాణం కోసం రూ.లక్ష విరాళం అందజేశారు. పద్మశాలి సంక్షేమ సేవా సమితి (ట్రస్ట్), వనపర్తి జిల్లా ఆధ్వర్యంలో చేపడుతున్న విరాళాల సేకరణ కార్యక్రమంలో భాగంగా బాలరాజు ఈ మొత్తాన్ని అందించారు.

ఆలయ నిర్మాణానికి తనవంతు సహకారం అందించడం పట్ల ట్రస్ట్ సభ్యులు దాతృత్వం చాటుకున్న బాలరాజును అభినందించారు. ఆలయ నిర్మాణం విజయవంతంగా పూర్తయ్యేందుకు భక్తులు, దాతలు తమవంతు సహకారం అందించాలని ట్రస్ట్ సభ్యులు కోరారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ రావిరాల శ్రీనివాస్, కార్యదర్శి కర్లీ శాంతయ్య, కోశాధికారి బాస శంకరయ్య పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>