కలం, వరంగల్ బ్యూరో : ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో రాష్ట్రంలో జనగామ జిల్లా మొదటి స్థానం.. జిల్లాలో స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం ప్రథమ స్థానంలో ఉందని ఎమ్మెల్యే కడియం శ్రీహరి (Kadiyam Srihari) వెల్లడించారు. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గానికి మంజూరు అయిన 3,500 ఇళ్లలో 3,400 ఇల్లు గ్రౌండింగ్ చేసినట్లు తెలిపారు. హనుమకొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఉమ్మడి వరంగల్ జిల్లా సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి పాల్గొన్నారు.
ఈ సమావేశంలో కడియం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ప్రజల నుండి మంచి స్పందన వస్తుందని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో కొన్ని సమస్యలు ఉన్నాయని వాటిని పరిష్కరించే విధంగా మంత్రి చర్యలు తీసుకోవాలని కోరారు. ఇందిరమ్మ ఇల్లు మంజూరు పత్రాలు ఇచ్చిన తర్వాత బేస్ మెంట్ లెవల్ నిర్మాణం పూర్తి అయిన మొదటి బిల్లు వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఎల్ 3లో ఉన్నారని బిల్లు ఆపేశారన్నారు.
వెంటనే ఆ సమస్యను పరిష్కరించి లబ్ధిదారులకు బిల్లులు చెల్లించాలని కోరారు. ఇందిరమ్మ ఇల్లు మంజూరు అయి నిర్మాణం చేపట్టని వారి స్థానంలో కొత్త వారికి శాంక్షన్ ఇచ్చే విధంగా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల విషయంలో ఎలాంటి సమస్యలు ఉన్నా వెంటనే పరిష్కరించాలని హౌసింగ్ ఎండీకి, జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అలాగే ఇందిరమ్మ ఇళ్లకు ఉచిత విద్యుత్ కనెక్షన్లు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రికి కడియం (Kadiyam Srihari) విజ్ఞప్తి చేశారు.
Read Also: ఖమ్మం బీజేపీలో రచ్చ.. గోల్డ్ స్కామ్ అస్త్రంతో జిల్లా అధ్యక్షుడి మార్పు ఖాయమా!
Follow Us On: Youtube


