కలం, వెబ్ డెస్క్ : కరీంనగర్ (Karimnagar) జిల్లాలోని ఓ ఊరులో వింత ఘటన చోటు చేసుకుంది. 3 నెల్లో 28 మంది చనిపోవడంతో.. ఊరుకు కీడు సోకిందంటూ గ్రామం మొత్తం ఖాళీ చేసి వెళ్లిపోయింది. ఈ విషయం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. కరీంనగర్ జిల్లా జమ్మికుంట (Jammikunta) మండలం గండ్రపల్లి గ్రామంలో గడిచిన 3 నెలల్లో 28 మంది వివిధ కారణాలతో చనిపోయారు. దీంతో గ్రామస్తులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. గ్రామ పెద్దలు ఓ పురోహితుడి దగ్గరకు వెళ్లి ఈ విషయంపై చర్చించగా.. గ్రామానికి కీడు సోకిందని సదరు పురోహితుడు తెలిపాడు.
గ్రామానికి పట్టిన కీడు వదలాలంటే ఒక రోజంతా గ్రామం ఖాళీ చేసి పొలాల్లో కీడు వంటలు చేసుకోవాలని గ్రామస్తులు నిర్ణయించారు. తెల్లవారుజామున డప్పు చాటింపు వేసి గ్రామస్తులు మొత్తం ఊరును ఖాళీ చేశారు. వారి పొలాల్లో, ఇంకొందరు రైల్వే బ్రిడ్జి కింద వంటలు చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ రోజుల్లో కూడా ఇలాంటివి నమ్ముతారా అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. అనవసరంగా ఇలాంటివి నమ్మి మోసపోవద్దని కోరుతున్నారు.
Read Also: BRSపై సీతక్క ఫైర్.. పదేళ్లు ఏం చేశారంటూ ఆగ్రహం
Follow Us On: Instagram

