కలం, వెబ్ డెస్క్: తునిలో చిన్నారి జాహ్నవి అదృశ్యం కేసు (Jahnavi Missing Case) రోజుకో ఊహించని ట్విస్ట్‌లు చోటుచేసుకుంటున్నాయి. చిన్నారి అదృశ్యమైన రోజున జాహ్నవితోపాటు పెంపుడు కుక్క పిల్ల కూడా అడవిలోకి వెళ్లినట్లు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా వెల్లడైంది. జూన్ 6న చిన్నారి కనిపించకుండా పోయిన కొద్దిసేపటికే, ఆ కుక్క పిల్ల మాత్రం ఆలయం పరిసరాల్లో ఒంటరిగా తిరుగుతూ కెమెరాకు చిక్కింది. అసలు జాహ్నవి కూడా కుక్క పిల్లతోపాటే ఆ దారిలోనే వచ్చిందా? లేదా దారి తప్పిపోయిందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే కోణంలో పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. ఈ కొత్త ట్విస్ట్‌తో జాహ్నవి అదృశ్యం కేసు ఇప్పుడు సరికొత్త మలుపు తిరిగింది.
తుని పరిసరాల్లో మూడేళ్ల చిన్నారి జాహ్నవి అదృశ్యమైన ఉదంతం (Jahnavi Missing Case) ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనంగా మారింది. గత రెండు వారాలుగా ఈ కేసులో అనేక ఊహాగానాలు, మిస్టరీలు, ట్విస్ట్‌లు చోటుచేసుకుంటున్నాయి. చిన్నారి ఆచూకీ కోసం ఏపీ పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఫలితం లేకుండాపోయింది. సుమారు 200 నుంచి 500 మంది వరకు పోలీసు సిబ్బంది తోటలను, చుట్టుపక్కల కొండ ప్రాంతాలను జల్లెడ పట్టారు. గాలింపు చర్యల కోసం డ్రోన్ కెమెరాలు, ప్రత్యేక జాగిలాలతో గాలించినా చిన్నారి జాడ తెలియదు. ప్రస్తుతం ఈ ఘటన ఏపీలో మరింత ఉత్కంఠ రేపుతోంది.
Read Also: సాయికృష్ణది రెడ్‌బుక్ రాజ్యాంగం హత్యే: గుడివాడ అమర్నాథ్
Follow Us On: Instagram

