కలం, వెబ్ డెస్క్: పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో జగిత్యాల ఎమ్మెల్యే ఎం.సంజయ్(Jagtial MLA Sanjay)కి భారీ ఊరట లభించింది. ఆయనపై అనర్హత వేటు వేయాలని దాఖలైన పిటిషన్‌ను స్పీకర్ కొట్టివేశారు. ఎన్నికల అనంతరం బీఆర్ఎస్(BRS) నుంచి 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారని పేర్కొంటూ, వారిపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్, బీజేపీ(BJP) నేతలు పలువురు స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే సంజయ్‌పై చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పిటిషన్ వేశారు. దీనిపై నేడు స్పీకర్ విచారణ చేపట్టారు. సంజయ్ పార్టీ మారారు అనడానికి ఎలాంటి ఆధారాలు లేవని ఈ పిటిషన్‌ను కొట్టివేశారు. దీంతో ఇప్పటి వరకు పార్టీ ఫిరాయింపుల కేసులో ఎనిమిది మందికి స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. మరోవైపు కడియం శ్రీహరి, దానం నాగేందర్‌కు సంబంధించిన పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. మరోవైపు బీఆర్ఎస్ నుంచే గెలిచాను, నేను ఆ పార్టీ ఎమ్మెల్యేనే అని సంజయ్ ప్రకటించారు. తాను కేవలం అభివృద్ధి కోసమే కాంగ్రెస్‌తో కలిసి పని చేస్తున్నట్లు చెప్తున్నారు. ఇప్పటికీ తన జీతంలో నుంచి రూ.5 వేలు బీఆర్ఎస్ పార్టీకి వెళ్తున్నాయని తెలిపారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ విప్ జారీ చేసి బిల్లులు ప్రవేశపెట్టినా అనుకూలంగా ఓటు వేస్తానని సంజయ్ ప్రకటించారు.


