epaper
Wednesday, February 18, 2026
epaper

పాకిస్థాన్ బాయ్‌కాట్‌పై గంభీర్ రియాక్షన్ ఇదే..!

కలం, వెబ్ డెస్క్ : టీ20 వరల్డ్ కప్‌లో భారత్‌తో మ్యాచ్‌ను పాకిస్థాన్ బాయ్ కాట్ చేయడంపై టీమిండియా హెడ్‌కోచ్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) మౌనం పాటించడం ప్రస్తుతం కీలకంగా మారింది. పాకిస్థాన్ (Pakistan) బహిష్కరణ అంశంపై మీడియా ప్రశ్నలకు ఆయన స్పందించలేదు. వివాదాలకంటే క్రికెట్‌పైనే దృష్టి ఉన్నట్లు ఆయన ప్రవర్తనతో తెలియజేశారు. ఫిబ్రవరి 15న కొలంబోలో జరగాల్సిన ఇండియా–పాక్ గ్రూప్ ఏ మ్యాచ్‌పై పాకిస్థాన్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. వరల్డ్ కప్‌కు జట్టు వెళ్తుందని తెలిపింది. ఇండియాతో మ్యాచ్‌లో మాత్రం ఆడబోమని స్పష్టం చేసింది. ఈ పరిణామాలపై మీడియా ప్రశ్నించగా గంభీర్ ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. శుభాకాంక్షలను స్వీకరించి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

పాకిస్థాన్ నిర్ణయానికి కారణాలు వెల్లడించకపోవడంతో క్రికెట్ వర్గాల్లో అనిశ్చితి నెలకొంది. ఈ అంశంపై ఐసీసీ నుంచి పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు గట్టి స్పందన వచ్చినట్లు సమాచారం. ఇక వరల్డ్ కప్‌లో ఇండియా ప్రయాణం ఫిబ్రవరి 7న ప్రారంభమవుతుంది. ముంబయి వాంఖడే స్టేడియంలో యూఎస్ఏతో తొలి మ్యాచ్ ఆడనుంది. ఇది గంభీర్‌కు ఇండియా కోచ్‌గా రెండో ఐసీసీ టోర్నీ. గతంలో 2025 చాంపియన్స్ ట్రోఫీ గెలుపుతో ఆయన ఖాతా తెరిచారు. ఇదిలా ఉండగా పాకిస్థాన్ మాజీ వికెట్‌ కీపర్ కమ్రాన్ అక్మల్ (Kamran Akmal) ఐసీసీపై తీవ్ర వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం.

ఇండియాతో మ్యాచ్ బహిష్కరణకు మద్దతు ప్రకటించిన ఆయన, గత ఆసియా కప్ హైబ్రిడ్ మోడల్ అంశాన్ని ప్రస్తావించారు. భారత్ తటస్థ వేదికపై మాత్రమే ఆడిన విషయాన్ని కూడా గుర్తు చేసినట్లు తెలిపారు. 2025 ఆసియా కప్‌లో ఇండియా–పాకిస్థాన్ జట్లు మూడు సార్లు తలపడ్డాయి. ఆ మూడు మ్యాచ్‌ల్లో ఇండియానే విజయం సాధించింది. వరల్డ్ కప్ సమీపిస్తున్న నేపథ్యంలో ఈ అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఐసీసీ స్థాయిలో చర్చలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. క్రికెట్ ప్రపంచం తదుపరి పరిణామాలపై దృష్టి పెట్టింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>