కలం, వెబ్ డెస్క్ : జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పై కొరుట్ల ఎమ్మెల్యే సంజయ్ (MLA Sanjay) తీవ్ర విమర్శలు చేశారు. జగిత్యాల ఎమ్మెల్యే ఓ యూజ్ లెస్ ఫెలో.. అతనికి కామన్ సెన్స్ లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ పార్టీనో తెలియన వ్యక్తి తమపై విమర్వలు చేయడం సిగ్గుచేటన్నారు. దమ్ముంటే రాజీనామా చేయాలని ఆయన సవాల్ విసిరారు. కొరుట్లలో రాజీనామా చేసి జగిత్యాల(Jagtial)లో పోటీ చేస్తానన్నారు. కేసీఆర్(KCR) పెట్టిన రాజకీయ బిక్షతో ఎమ్మెల్యేగా గెలిచావని తెలిపారు. వ్యక్తిగత అవసరాలు, స్వలాభం కోసం జిగిత్యాల ప్రజలను మోసం చేసి కాంగ్రెస్ లో చేరినట్లు ఆరోపించారు.
జిల్లా ప్రజలకు కీలకమైన మెడికల్ కాలీజీ నిర్మాణ పనులు రెండేళ్లుగా నత్తనడకన సాగుతుంటే ఏం చేస్తున్నావు అని కల్వకుంట్ల సంజయ్ ప్రశ్నించారు. జిల్లా, నియోజకవర్గ సమస్యలపై ఏనాడు కూడా అసెంబ్లీలో లేవనెత్తలేదని విమర్శించారు. కాంట్రాక్టులు, బిల్లులు తప్ప ఆయనకు ప్రజా సమస్యలు పట్టడం లేదని ఆరోపణలు చేశారు. సంజయ్ మాటలు చూస్తుంటే ఆయన అభద్రతను చాటుతున్నాయని కల్వకుంట్ల సంజయ్ (MLA Sanjay) ఎద్దేవా చేశారు.
Read Also: IPL 2026 వేలంలో మెరిసిక కామెరూన్.. ఎంత ఖరీదంటే..!
Follow Us On: X(Twitter)


