కలం, కరీంనగర్ బ్యూరో: జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం యశ్వంతరావుపేటలో రెండు రోజుల క్రితం జరిగిన అగ్ని ప్రమాదంలో బండ్ర భూమక్క, కాంతయ్యకు చెందిన 2 ఎకరాల మామిడి తోట కాలిపోయింది. 70 చెట్లు, డ్రిప్ పైపులు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదేశాల మేరకు బుగ్గారం మండల కాంగ్రెస్ (Jagtial Congress) అధ్యక్షులు నగునూరి నర్సగౌడ్ ఘటనా స్థలాన్ని శుక్రవారం పరిశీలించారు. నర్సాగౌడ్ సమాచారంతో వ్యవసాయ అధికారి అక్షిత, హార్టికల్చర్ అధికారి వంశీకృష్ణ, రెవెన్యూ అధికారులు స్పందించి నష్టంపై సర్వే చేపట్టారు. బాధిత రైతు కుటుంబానికి ప్రభుత్వం నుండి తగిన పరిహారం అందేలా కృషి చేస్తామని అధికారులు, నర్సగౌడ్ హామీ ఇచ్చారు. ఉపసర్పంచ్ కోల శ్రీనివాసు, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి పెద్దనవేణి శంకర్ తదితరులు పాల్గొన్నారు.
Raed Also: గురుకులాలకు భారీ స్పందన.. ఫేజ్-1లో 18,401 సీట్లు భర్తీ: మంత్రి లక్ష్మణ్
Follow Us On : WhatsApp

