గుర్తింపు పత్రాలు లేనిదే గదులు ఇవ్వొద్ధు: జగిత్యాల సీఐ కరుణాకర్

కలం, కరీంనగర్ బ్యూరో: సరైన గుర్తింపు పత్రాలు లేనిదే లాడ్జిల్లో గదులు ఇవ్వొద్దని జగిత్యాల (Jagtial) టౌన్ సీఐ కరుణాకర్ (CI Karunakar) సూచించారు. జగిత్యాల పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణ, నేర నియంత్రణలో భాగంగా లాడ్జ్ యజమానులకు జగిత్యాల పట్టణ పోలీసులు కీలక ఆదేశాలు జారీ చేశారు. జగిత్యాల టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లాడ్జ్ నిర్వాహకులతో సీఐ కరుణాకర్ బుధవారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ, లాడ్జ్‌లలో గదులు కేటాయించే ముందు ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడీ వంటి చెల్లుబాటు అయ్యే గుర్తింపు పత్రాలు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. అతిథుల పూర్తి వివరాలను రిజిస్టర్‌లో నమోదు చేసి, అవసరమైనప్పుడు పోలీసులకు అందజేయాలన్నారు.

అంతేకాకుండా, లాడ్జ్ ప్రాంగణంలో ప్రవేశ ద్వారాలు, రిసెప్షన్, పార్కింగ్, కారిడార్ల వద్ద 24 గంటలు పనిచేసే నాణ్యమైన సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సీసీ ఫుటేజ్‌ను కొంతకాలం భద్రపరచాలని సూచించారు. అనుమానాస్పదంగా కనిపించే వారికి, సరైన ఐడీ ప్రూఫ్ లేని వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ గదులు ఇవ్వొద్దని స్పష్టం చేశారు. ఏదైనా అనుమానాస్పద కదలికలు గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ మార్గదర్శకాలను ఉల్లంఘించే యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఐ కరుణాకర్ హెచ్చరించారు. పట్టణ భద్రత కోసం లాడ్జ్ నిర్వాహకులు పోలీసు శాఖతో సమన్వయంతో పని చేయాలని సీఐ కరుణాకర్ విజ్ఞప్తి చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>