కలం, కరీంనగర్ బ్యూరో : అధికారానికి దూరమైన కవిత పరామర్శ పేరుతో సిరిసిల్లకు రావడం సిగ్గు చేటని జాగృతి బాధితుల సంఘం నాయకులు (Jagruti Victims Association) అన్నారు. సోమవారం సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ పిడికెడు మందితో ప్రారంభమైన తెలంగాణ జాగృతి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల సహకారంతో అంచలంచెలుగా ఎదిగిందని తెలిపారు. అధికారంలోకి వచ్చిన తర్వాత గర్వంతో కార్యకర్తల భుజాలను తొక్కి విలాసవంతమైన జీవితాన్ని కవిత గడిపిందని, ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత పరామర్శల పేరుతో రావడం సిగ్గుచేటని విమర్శించారు.
సిరిసిల్ల జిల్లాలో బీడీ కార్మికులకు కనీసం పెన్షన్ విషయంలో, ఖమ్మం జిల్లా చింతపల్లి మండలంలో మరియమ్మ లాకప్ డెత్, ఎల్బీనగర్లో లక్ష్మీ అనే మహిళను పోలీసులు విచక్షణ రహితంగా కొట్టినప్పుడు కవిత మాట్లాడలేదని గుర్తు చేశారు. గ్రూప్ వన్ అభ్యర్థిని చనిపోయిన పట్టించుకోలేదని వారు ఆరోపించారు. జనం బాట పేరుతో కవిత రాజన్న సిరిసిల్ల జిల్లా నేరెళ్ల (Nerella) దళితులను పరామర్శించడానికి రావడం విడ్డూరంగా ఉందని తెలంగాణ జాగృతి బాధితుల ఐక్యవేదిక (Jagruti Victims Association) నాయకులు అన్నారు.
Read Also: కవితను కీలు బొమ్మలా ఆడిస్తున్నారు : గొంగిడి సునీత
Follow Us On: Sharechat


