Mobile Popup Ad
Mobile Popup Ad

పెద్ది నా కెరీర్‌లోనే నెంబ‌ర్ వ‌న్ సినిమా: జ‌గ‌ప‌తి బాబు

క‌లం, వెబ్‌డెస్క్‌: టాలీవుడ్ సీనియ‌ర్ న‌టుడు జ‌గ‌ప‌తి బాబు (Jagapathi Babu) త‌న సినీ కెరీర్‌పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. జ‌గ‌ప‌తి బాబు న‌టించిన లేటెస్ట్ మూవీ పెద్ది (Peddi) విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. రామ్ చ‌ర‌ణ్ హీరోగా న‌టించిన ఈ సినిమాపై భారీ అంచ‌నాలున్నాయి. ఈ సినిమా విడుద‌ల సంద‌ర్భంగా జ‌గ‌ప‌తి బాబు ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ.. ఇప్ప‌టి వ‌ర‌కు తాను చేసిన ఎన్నో సినిమాల్లో కేవ‌లం ఆరింటిని మాత్ర‌మే త‌న మ‌న‌సుకు గుర్తున్న సినిమాలుగా చెప్పుకొచ్చారు. వీటిలో బాల‌కృష్ణ‌తో చేసిన లెజెండ్‌, మ‌హేశ్ బాబుతో చేసిన శ్రీమంతుడు, ఎన్టీఆర్‌తో చేసిన నాన్న‌కు ప్రేమ‌తో, అరవింద సమేత, రామ్ చ‌ర‌ణ్‌తో చేసిన రంగస్థలం సినిమాల‌తో పాటు తన రాబోయే సినిమా పెద్దిని ఆ లిస్ట్‌లో చేర్చారు. ముఖ్యంగా పెద్ది మూవీ తన కెరీర్‌లోనే అత్యంత స్పెష‌ల్ కాబోతోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

తాను ఇప్ప‌టి వ‌ర‌కు చేసిన అన్ని క్యారెక్ట‌ర్ల‌ను మించేలా పెద్ది సినిమాలో క్యారెక్ట‌ర్ ఉంటుంద‌ని జగపతి బాబు పేర్కొనడం ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఆ సినిమాలో తాను పోషించిన క్యారెక్ట‌ర్‌ అంత ప‌వ‌ర్‌ఫుల్‌గా ఉంటుందని, కచ్చితంగా ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటుందని ఆయన వివరించారు. తనలోని నటుడికి పూర్తి సంతృప్తినిచ్చిన పాత్ర కాబట్టే, రిలీజ్‌కు ముందే ఈ సినిమాపై తనకు ఇంతటి నమ్మకం ఉందని ఆయన వెల్లడించారు. ఇక జ‌గ‌ప‌తి బాబు ఇచ్చిన స్టేట్‌మెంట్‌తో రామ్ చ‌ర‌ణ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోతున్నారు. చెర్రీ ఖాతాలో మ‌రో భారీ హిట్ ప‌డ్డ‌ట్లేన‌ని సోష‌ల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>