మంత్రుల అనుమతితోనే రైతుల ధాన్యం కటింగ్: జగదీశ్ రెడ్డి

కలం, వెబ్ డెస్క్: నల్గొండ జిల్లా మంత్రుల అనుమతితోనే రైతుల ధాన్యం కటింగ్ జరుగుతోందని బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి (Jagadish Reddy) ఆరోపించారు. నల్గొండలో సోమవారం బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో రైతులు మహా ధర్నా చేపట్టారు. రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ కలెక్టరేట్ వద్ద ధర్నాకు దిగారు. పార్టీ శ్రేణులతో కలిసి కలెక్టరేట్ వద్ద బీఆర్ఎస్ నాయకులు ధర్నా చేపట్టి.. వరి ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ.. నల్గొండ జిల్లా మంత్రులు మిల్లింగ్ యజమానుల దగ్గర డబ్బులు దండుకొని, అమాయక రైతులను కసాయి వాళ్లకు అప్పగించినట్టు వదిలేశారని దుయ్యబట్టారు. ఈ విషయాన్ని నల్గొండ జిల్లా రైతాంగం దీనిని అర్ధం చేసుకోవాలన్నారు. మంత్రికి ఇచ్చిన పైసలు తమకు ఎక్కడ నుండి రావాలి? అని మిల్లర్లే బహిరంగంగా అడుగుతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. జిల్లాలో అద్భుతంగా ఉన్నటువంటి వ్యవసాయాన్ని నాశనం చేసినటువంటి పాపం కాంగ్రెస్ పార్టీదేనన్నారు.

జిల్లాలో పర్యటించేందుకు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలకు హెలికాప్టర్ దొరకడం లేదని జగదీశ్ రెడ్డి ఎద్దేవా చేశారు. అందుకే ఈ 3 నెలల నుండి నల్గొండకు వస్తలేరని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో జిల్లాలో తాను ఒక్కడినే మంత్రిగా ఉన్నప్పుడు 500, 600 కిలోమీటర్లు కారులో తిరిగే వాడిని అని గుర్తు చేశారు. నేడు రాష్ట్రంలో అధికారంలో ఉన్నది మోడీ, చంద్రబాబుకు పుట్టిన హైబ్రిడ్ కాంగ్రెస్ పార్టీ అని ఆరోపించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>