Mobile Popup Ad
Mobile Popup Ad

ఏపీ వ్యాప్తంగా ఐటీ దాడులు

కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్‌లో డిజిటల్ పేమెంట్లలో అవకతవకల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఐటీ శాఖ శుక్రవారం పెద్ద స్థాయిలో సోదాలు (IT Raids) నిర్వహించింది. విశాఖపట్నం, రాజమండ్రి, నెల్లూరు జిల్లాలలోని రెస్టారెంట్లపై పెద్ద స్థాయిలో సోదాలు నిర్వహించారు. విశాఖ (Visakhapatnam)లో సెలబ్రేషన్స్ రెస్టారెంట్స్, రాజమండ్రి (Rajahmundry) లో బర్కాస్ అరేబియన్ మండి, నెల్లూరు (Nellore)లో వెంగమాంబ ధాబా వంటి రెస్టారెంట్లలో ఐటీ అధికారులు తనిఖీలు చేశారు. డిజిటల్ చెల్లింపుల సరళతలలో సమస్యలు, అక్రమ లావాదేవీల ఆధారాలను సేకరించడానికి ఐటీ అధికారులు సోదాలను  చేపట్టారు. సోదాల సమయంలో పాత లావాదేవీల రికార్డులు, బుకింగ్స్, ఆన్‌లైన్ చెల్లింపుల రసీదు వంటి పత్రాలు పరిశీలించబడ్డాయి. పోలీసులు, ఐటీ అధికారులు కలసి సోదాలు నిర్వహిస్తున్నారు.

Read Also: చంద్రబాబు కాన్వాయ్ ట్రయల్ రన్ విషాదం.. యువకుడు మృతి

Follow Us On: Facebook

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>