Mobile Popup Ad
Mobile Popup Ad

చంద్రబాబు కాన్వాయ్ ట్రయల్ రన్ విషాదం.. యువకుడు మృతి

కలం, వెబ్ డెస్క్ : సీఎం చంద్రబాబు పర్యటన సందర్భంగా విషాదం నెలకొంది. మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు (Chandrababu) కాన్వాయ్ ట్రయల్ రన్ వ్యాన్ ఢీకొని యువకుడు మృతి చెందాడు. మార్కాపురం జిల్లా దోర్నాల మండలం చిన్న గుడిపాడు వద్ద ఈ ప్రమాదం జరిగింది. మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన ఉండటంతో.. కాన్వాయ్ వెళ్లే రోడ్డు మార్గంలో భద్రతా ఏర్పాట్లను పరిశీలించేందుకు అధికారులు కాన్వాయ్ ట్రయల్ రన్ ను ఏర్పాటు చేశారు.

అయితే కాన్వాయ్ ట్రయల్ రన్ లోని ఓ వ్యాన్ ఓవర్ స్పీడ్ తో చిన్న గుడిపాడు వద్ద రాంగ్ రూట్ లోకి వచ్చి బైక్ ను ఢీకొట్టింది. బైక్ పై ఉన్న అంకన్న (25) గాల్లో ఎగిరిపడ్డాడు. తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అంకన్న తప్పేం లేదని.. వ్యాన్ ఓవర్ స్పీడ్ తో రాంగ్ రూట్ లో వచ్చి ఢీకొట్టిందని స్థానికులు చెబుతున్నారు. అంకన్నది కూడా చిన్న గుడిపాడు గ్రామమే అని తెలుస్తోంది.

Read Also: సంక్షోభంలో సహాయం.. లులు గ్రూప్‌కు కృతజ్ఞతలు : లోకేశ్

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>