ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మరో వీడియో రిలీజ్

కలం, వెబ్ డెస్క్ : ఇరాన్ తో ఇజ్రాయెల్, అమెరికా భీకర యుద్ధం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు (Netanyahu) చనిపోయారంటూ పెద్ద ఎత్తున వదంతులు రావడంతో నిన్న ఆయన ఓ వీడియో ద్వారా తాను బతికే ఉన్నట్టు క్లారిటీ ఇచ్చారు. నిన్న కాఫీ తాగుతూ తన చేతివేళ్లను చూపిస్తూ క్లారిటీ ఇచ్చారు. అంతకు ముందు ఆయన చేతికి ఆరువేళ్లు ఉన్న ఓ ఏఐ వీడియో ప్రచారం కావడం వల్ల ఆయన చనిపోయారంటూ రూమర్లు పెరిగాయి. వాటిపై నిన్న క్లారిటీ ఇచ్చారు.

అయితే ఆ కాఫీ వీడియోపై కూడా రకరకాల రూమర్లు వచ్చాయి. అది కూడా ఏఐ వీడియో అంటూ కొందరు పోస్టులు పెడుతున్నారు. దీంతో నేడు మరో వీడియో రిలీజ్ చేశారు నెతన్యాహు (Netanyahu). ఈ సారి బయట తిరుగుతూ.. ప్రజలతో మాట్లాడారు. ఇజ్రాయెల్ లో ప్రజలు ప్రశాంతంగా ఉన్నారని.. తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని చెప్పేందుకు ఈ వీడియోను రిలీజ్ చేసినట్టు కనిపిస్తోంది. దీంతో నెతన్యాహు వీడియోపై ప్రపంచ వ్యాప్తంగా మళ్లీ చర్చ జరుగుతోంది. ఇజ్రాయెల్ మీద ఇరాన్ భీకరంగా దాడులు చేస్తుంటే.. ప్రజలు అంత ప్రశాంతంగా టూరిస్టు ప్లేసుల్లో ఎలా గడుపుతున్నారంటూ ప్రశ్నలు వస్తున్నాయి. ఇదంతా స్క్రిప్టు ప్రకారం చేశారా.. లేదంటే నిజంగానే ఇజ్రాయెల్ లో అంత ప్రశాతంగా ఉన్నారా అనేది ఇక్కడ సస్పెన్స్.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>