బలగం బాటలో ఇరుముడి.. వలిగొండలో భారీ స్కీన్‌పై సినిమా ప్రదర్శన

కలం, వలిగొండ: ఇరుముడి సినిమా (Irumudi Movie) విడుదలైన రోజు నుండి తెలుగు రాష్ట్రాల్లో ప్రేక్షకుల విశేష ఆదరణ పొందింది. ఇదే క్రమంలో వినాయక చవితి సందర్భంగా గ్రామాలలో ఏర్పాటు చేసిన గణేశుడి మండపాల వద్ద నిర్వాహకులు భారీ స్క్రీన్ ఏర్పాటు చేసి ఇరుముడి సినిమాను ప్రదర్శిస్తున్నారు.

వలిగొండ (Valigonda) మండలంలో ఇప్పటికే పలు గ్రామాలలో వినాయకుడి మండపాల వద్ద రాత్రి వేళల్లో ఇరుముడి సినిమాను ప్రదర్శించగా గ్రామస్తులు పెద్ద ఎత్తున హాజరై సినిమాను వీక్షించి అద్భుతమైన సినిమా అంటూ ప్రశంసిస్తు నిర్వాహకులను అభినందిస్తున్నారు.

గతంలో కూడా బలగం సినిమాను ఇదేవిధంగా గ్రామాలలో పెద్ద స్క్రీన్‌ల ద్వారా ప్రదర్శించడం జరగగా తాజాగా ఇరుముడి సినిమా కూడా అదే విధంగా గ్రామాల్లో పెద్ద స్క్రీన్‌లపై తన జోరును కొనసాగిస్తుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>