ట్రాఫిక్ కష్టాలకు చెక్: కరీంనగర్‌లో కొత్త ట్రాఫిక్ ఔట్‌పోస్ట్‌లు ప్రారంభం

కలం, కరీంనగర్: కరీంనగర్‌ ( Karimnagar)లో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, ప్రయాణికుల భద్రతే ధ్యేయంగా తెలంగాణ చౌక్, మంచిర్యాల చౌరస్తాలో ఏర్పాటు చేసిన నూతన ట్రాఫిక్ ఔట్‌పోస్ట్ బూత్‌లను పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం శనివారం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ట్రాఫిక్ ఏసీపీ యాదగిరి స్వామి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. నగరంలోని రద్దీ ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలను నియంత్రించడంతో పాటు నిరంతరం పర్యవేక్షించేందుకు ఈ ఔట్‌పోస్ట్ బూత్‌లు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. ప్రయాణికులు, వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసీపీ యాదగిరి స్వామితో పాటు ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్లు సంజీవ్, అంజయ్య, సబ్‌-ఇన్‌స్పెక్టర్లు, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>