అప్పు తీర్చలేదని అవమానం.. మనోవేదనతో వ్యక్తి ఆత్మహత్య

కలం, ​కరీంనగర్: అప్పు విషయంలో జరిగిన పంచాయితీలో అవమానానికి గురై, తీవ్ర మనోవేదనతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన కరీంనగర్ రూరల్ మండలంలోని ఇరుకుల గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..​ ఇరుకుల గ్రామానికి చెందిన బిజిలి రాజయ్య (45) రెండేళ్ల క్రితం తన కుమార్తె పెళ్లి కోసం గర్రేపల్లికి చెందిన బిజిలి మల్లయ్య వద్ద రూ.1 లక్ష అప్పు తీసుకున్నాడు. అప్పు తీర్చడంలో ఆలస్యం కావడంతో మల్లయ్య తీవ్ర ఒత్తిడి తెచ్చాడు. ఈ క్రమంలో రాజయ్య వద్ద ఉన్న పందులను తక్కువ ధరకు తీసుకున్న మల్లయ్య, మిగిలిన డబ్బుల కోసం గర్రేపల్లిలో కుల పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టించాడు.

పంచాయితీలో పందుల ధరను రూ.35,000గా నిర్ణయించి, మిగిలిన రూ.65,000లను నాలుగు నెలల్లో చెల్లించాలని ఒప్పందం చేశారు. అయితే, గడువులోగా డబ్బులు ఇవ్వకపోతే ఇంటికి తాళం వేసి, తీవ్రంగా అవమానిస్తానని అందరి ముందూ మల్లయ్య బెదిరించడంతో రాజయ్య తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. ​ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులకు విషయం చెప్పి బాధపడ్డ రాజయ్య, మరుసటి రోజు ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ​మృతుడి భార్య బిజిలి రమ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బిజిలి మల్లయ్యపై కేసు నమోదు చేసి, దర్యాప్తు జరుపుతున్నట్లు కరీంనగర్ రూరల్ సీఐ నిరంజన్ రెడ్డి తెలిపారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అందజేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>