చండూరులో ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు

కలం, మునుగోడు : తెలంగాణ విమోచన దినోత్సవం మరియు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకొని చండూరు (Chandur) మండల కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ విమోచన కోసం పోరాడిన అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ నివాళులు అర్పించారు. వారి త్యాగాలు, పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమని నాయకులు పేర్కొన్నారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలను నిర్వహించి కేక్ కట్ చేశారు.

దేశ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం మోదీ గారు చేస్తున్న కృషిని నాయకులు ప్రస్తావించారు. ఆయనకు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని ఆకాంక్షించారు. మోదీ జన్మదినాన్ని పురస్కరించుకొని రక్తదాన శిబిరాన్ని కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షుడు, చామలపల్లి సర్పంచ్ ముదిగొండ రామాంజనేయులు, మున్సిపల్ అధ్యక్షులు భూతరాజు శ్రీహరి, రాష్ట్ర నాయకులు కోమటి వీరేశం, నల్లగొండ జిల్లా కార్యదర్శి వరికుప్పల గిరి, పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>