Mobile Popup Ad
Mobile Popup Ad

ఎంపీ ఇంట్లో సోదాలు.. బంగారు లోదుస్తులు, కోట్ల నగదు సీజ్

కలం, వెబ్ డెస్క్ : రాజకీయ నాయకుల అవినీతికి అదుపులేకుండా పోతుంది. ప్రజలకు సేవ చేయాల్సిన ప్రజా ప్రతినిధులు అప్పనంగా వచ్చిన సొమ్ముతో జల్సాలు చేస్తున్నారు. బంగారం, కోట్ల సొమ్మును కూడబెట్టుకుంటున్నారు. భారత్ లోనే కాదు.. ఇలాంటి ఘటనలు ప్రపంచంలోని పలు దేశాల్లో వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా, ఇరాక్ మహిళా ఎంపీ హింద్ అల్-అబ్బాసీ (Iraq MP Hind Al-Abbasi) సోదాలు చేసిన అధికారులకు షాకింగ్ సీన్ కనిపించింది.

అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇరాక్ ఎంపీల నివాసాల్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు చేశారు. బాగ్దాద్ లోని ‘గ్రీన్ జోన్’ పరిధిలో జరిపిన దాడుల్లో 47 మంది రాజకీయ నాయకులు, పార్లమెంట్ సభ్యులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, ఎంపీ హింద్ అల్-అబ్బాసీ నివాసంలో సోదాలు చేసిన అవినీతి అధికారులు అవాక్కయ్యారు. సోదాల్లో 57 మిలియన్ డాలర్ల నగదు, 27 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. అందులో బంగారంతో తయారు చేసిన లో దుస్తులు లభ్యం అయినట్లు అంతర్జాతీయ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో ఈ ఘటన సంచలనంగా మారింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>