అమెరికాతో యుద్ధం.. గల్ఫ్ దేశాలకు ఇరాన్ వార్నింగ్

కలం, వెబ్ డెస్క్ : అమెరికాతో యుద్ధం జరుగుతున్న వేళ గల్ఫ్ దేశాలకు ఇరాన్ (Iran) తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. యూఎస్ (US) , ఇజ్రాయెల్ (Israel) తమ తీరాలపై లేదా ద్వీపాలపై దాడి చేస్తే, పర్షియన్ గల్ఫ్ అంతటా మైన్స్ మోహరిస్తామని హెచ్చరించింది. దీని వల్ల ఈ ప్రాంతంలోని కీలక జలమార్గాలను మూసివేయగలదని స్పష్టం చేసింది. ఈ మేరకు ఇరాన్ జాతీయ రక్షణ మండలి సోమవారం కీలక ప్రకటన చేసింది. శత్రువులు ఇరాన్ తీరాలను లేదా ద్వీపాలను లక్ష్యంగా దాడులు చేసే ప్రయత్నం చేస్తే గల్ఫ్ దేశాలకు సంబంధించిన సముద్ర జలాల్లో, కమ్యూనికేషన్ లైన్లలో మైన్స్ పెడుతామని వార్నింగ్ ఇచ్చింది.

దీని వల్ల మొత్తం పర్షియన్ గల్ఫ్ దేశాలు సుదీర్ఘ కాలంపాటు హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) మూసివేసినప్పుడు కలిగిన ఇబ్బందులను ఎదుర్కొంటాయని సూచించింది. దీనికి బాధ్యత ఖచ్చితంగా శతృ దేశాలేదనని ఇరాన్ స్పష్టం చేసింది. యుద్ధంలో పాల్గొనని దేశాలు హర్మూజ్ జలసంధిని సురక్షితంగా దాటడానికి ఇరాన్ తో సమన్వయం చేసుకోవడమే ఏకైక మార్గం అని ఇరాన్ క్లారిటీ ఇచ్చింది. కాగా, అమెరికా – ఇరాన్ (Iran – US) యుద్ధం వల్ల హర్మూజ్ జలసంధి మూసివేశారు. సాధారణంగా దీని గుండా ప్రతిరోజూ సుమారు 20 మిలియన్ బ్యారెళ్ల చమురు రవాణా అవుతుంటుంది. అంతరాయం వల్ల రవాణా ఖర్చలు పెరగడంతో చమురు ధరలు, గ్యాస్ ధరలు అధికమయ్యాయి.

Read Also: 41 దేశాల నుంచి క్రూడ్ ఆయిల్ కొంటున్నాం : ప్రధాని మోదీ

Follow Us On: Instagram

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>