కలం, వెబ్ డెస్క్: ఏపీ శాసన మండలి (AP Council) సమావేశాలు ప్రారంభమైన కొద్ది సేపటికే ఆందోళనకర పరిస్థితులు ఏర్పడ్డాయి. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడును పదవి నుంచి తొలగించాలని వైసీపీ (YSRCP) సభ్యులు తీర్మానం ప్రవేశ పెట్టారు. ఈ తీర్మానాన్ని మండలి చైర్మన్ తిరస్కరించారు. దీంతో వైసీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా సభలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. వైసీపీ సభ్యుల ఆందోళనల నడుమ చైర్మన్ సభను వాయిదా వేశారు.

