Mobile Popup Ad
Mobile Popup Ad

ఫిఫా వరల్డ్ కప్‌లో ఇరాన్ జట్టుకు వీసా షాక్

కలం, వెబ్ డెస్క్ : ఫిఫా వరల్డ్ కప్ 2026 (FIFA World Cup 2026) నేపథ్యంలో ఇరాన్ ఫుట్‌బాల్ జట్టుకు(Iran Football Team) కొత్త ఇబ్బందులు ఎదురయ్యాయి. సహ ఆతిథ్య దేశమైన అమెరికా విధించిన కఠిన వీసా నిబంధనలపై ఇరాన్ ఫుట్‌బాల్ సమాఖ్య తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ అంశంపై ‘ఫిఫా’కు అధికారికంగా ఫిర్యాదు చేయాలని నిర్ణయించింది. టోర్నీ సన్నాహకాలలో భాగంగా ఇరాన్ జట్టు అనేక ఇబ్బందులు ఎదుర్కొంది. మ్యాచ్‌కు రెండు రోజుల ముందే అమెరికా చేరుకోవాల్సి ఉన్నా, అక్కడి అధికారులు అనుమతించలేదు. తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో 2-2తో డ్రా అయిన తర్వాత, విశ్రాంతి తీసుకునే అవకాశం లేకుండా వెంటనే మెక్సికోలోని టిజువానా క్యాంప్‌కు వెళ్లాలని ఆదేశించారు.

ప్రస్తుతం అమలులో ఉన్న వీసా నిబంధనల ప్రకారం మ్యాచ్‌కు ఒక రోజు ముందే అమెరికాలోకి ప్రవేశించి, మ్యాచ్ ముగిసిన వెంటనే దేశాన్ని విడిచి వెళ్లాల్సి వస్తోంది. ఈ ఆంక్షలు జట్లకు సమాన అవకాశాలు కల్పించే సూత్రానికి విరుద్ధమని ఇరాన్ ఫుట్‌బాల్ సమాఖ్య పేర్కొంది. ఇక ఆదివారం బలమైన బెల్జియం జట్టుతో జరగబోయే కీలక మ్యాచ్‌పై ఈ పరిస్థితి ప్రభావం చూపే అవకాశముంది.

జట్టు (Iran Football Team) కోచ్ అమీర్ ఘాలెనోయి మాట్లాడుతూ, వరల్డ్ కప్‌లో తమ జట్టే అత్యంత ఇబ్బందులు ఎదుర్కొంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, భద్రతా కారణాల వల్లే ఈ వీసా పరిమితులు అమలవుతున్నట్లు తెలుస్తోంది. అయినప్పటికీ ఎన్ని అడ్డంకులు వచ్చినా వెనుకడుగు వేయబోమని, బెల్జియం మ్యాచ్‌పై పూర్తి దృష్టి పెట్టామని జట్టు ప్రతినిధులు స్పష్టం చేశారు.

Read Also: హైవేపై ట్రక్ డ్రైవర్ వీరంగం.. దారి పొడ‌వునా రాళ్లు!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>