Mobile Popup Ad
Mobile Popup Ad

నెంబర్ ప్లేట్ లేని బైక్‌పై తరలిస్తున్న గంజాయి సీజ్

కలం, ఖమ్మం బ్యూరో : భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లాలోని భద్రాచలం (Bhadrachalam) ఇసుక ర్యాంప్ వద్ద పోలీసులు బైక్ పై తరలిస్తున్న 7.4 కేజీల ఎండు గంజాయిని సీజ్ చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎక్సైజ్ ఎస్ఐ శ్రీహరి వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో, నెంబర్ ప్లేట్ లేకుండా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని అనుమానంతో ఆపి తనిఖీ చేశారు. పరిశీలనలో 7.4 కేజీల ఎండు గంజాయి (Dry Ganja) గుర్తించబడింది.

గంజాయిని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి విచారించగా సిద్దిపేట జిల్లాకు చెందిన బొడ్డు చందు, కూరాకుల రోహిత్ అని గుర్తించారు. అనంతరం పోలీసులు బైక్, రెండు మొబైల్ ఫోన్లు, సీజ్ చేసిన గంజాయిని, ఇద్దరు నిందితులను భద్రాచలం ఎక్సైజ్ స్టేషన్‌లో అప్పగించి, దర్యాప్తు ప్రారంభించారని తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>