కలం, వెబ్ డెస్క్ : ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించిన 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) ఎంపిక ఇప్పుడు పెద్ద దుమారానికి దారితీసింది. ఈ యువ క్రికెటర్‌ను వెంటనే టోర్నీ నుంచి తొలగించి ఇంటికి పంపాలంటూ ఒక సామాజిక కార్యకర్త డిమాండ్ చేయడం క్రీడా వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. ఒక కన్నడ టీవీ ఛానల్ చర్చలో పాల్గొన్న సదరు యాక్టివిస్టు వైభవ్ వయస్సును ప్రధాన అస్త్రంగా చేసుకున్నారు.
వైభవ్ (Vaibhav Suryavanshi) ఇంకా చిన్న పిల్లాడని.. ఈ వయస్సులో ప్రొఫెషనల్ క్రికెట్ ఆడించడం చైల్డ్ లేబర్ కిందకు వస్తుందని ఆయన వాదిస్తున్నారు. పిల్లాడు మైదానంలో బ్యాట్ పట్టుకోవడం కాదని.. పుస్తకాలు పట్టుకుని స్కూలుకు వెళ్లి చదువుకోవాల్సిన సమయం ఇదని హితవు పలికారు. వెంటనే అతడిని లీగ్ నుంచి తప్పించకపోతే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొందరు దీనిని చైల్డ్ లేబర్ గా పరిగణించలేమని.. అది ప్రతిభకు నిదర్శనమని క్రికెట్ అభిమానులు కౌంటర్ ఇస్తున్నారు. రాజస్థాన్ రాయల్స్ భారీ ధరకు కొనుగోలు చేసిన ఈ యువ ఆటగాడి భవిష్యత్తుపై ఈ వివాదం ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.
Read Also: 16 ఏళ్ల పాటు ‘నో డిగ్రేడేషన్’.. బ్యాటరీ రంగంలో చైనా సంచలన ఆవిష్కరణ!
Follow Us On : WhatsApp

