Mobile Popup Ad
Mobile Popup Ad

16 ఏళ్ల పాటు ‘నో డిగ్రేడేషన్’.. బ్యాటరీ రంగంలో చైనా సంచలన ఆవిష్కరణ!

కలం, వెబ్ డెస్క్ : బ్యాటరీ రంగంలో చైనా (China) సరికొత్త సంచలనం సృష్టించింది. ఇప్పటి వరకు మనం సాధారణంగా మాడుతున్న స్మార్ట్‌ఫోన్, ఎలక్ట్రిక్ బ్యాటరీలు రెండు సంవత్సరాలకే ఖాళీ అయిపోతాయి. ఛార్జింగ్ త్వరగా అయిపోతుంటుంది. ఈ సమస్యకు చెక్ పెడుతూ చైనా సరికొత్త బ్యాటరీని తయారు చేసింది. ఈ సరికొత్త బ్యాటరీ ఛార్జింగ్ రెండు మూడు సంవత్సరాలు కాదు ఏకంగా 16 సంవత్సరాలు నిలుస్తుంది. బ్యాటరీ సామర్థ్యం తగ్గడం అనే సమస్యే లేకుండా, ఏకంగా 16 ఏళ్ల పాటు నిరంతరాయంగా పనిచేసే సరికొత్త ‘ఆల్-ఐరన్’ (All-Iron Flow Battery) బ్యాటరీని చైనా పరిశోధకులు కనుగొన్నారు. లిథియం బ్యాటరీలతో పోలిస్తే ఇది 80 రెట్లు తక్కువ ధరకే లభించడం విశేషం.

సాధారణంగా బ్యాటరీలను ఎన్నిసార్లు రీఛార్జ్ చేయవచ్చు అనే దానిపై వాటి జీవితకాలం ఆధారపడి ఉంటుంది. చైనా శాస్త్రవేత్తలు రూపొందించిన ఈ కొత్త ఫ్లో బ్యాటరీ (All-Iron Flow Battery) ఏకంగా 6,000 సార్లు రీఛార్జ్ చేసినా దాని పనితీరులో ఎలాంటి మార్పు రాదు. అంటే ప్రతిరోజూ ఒకసారి ఛార్జ్ చేసినా, దాదాపు 16 ఏళ్ల పాటు కొత్త బ్యాటరీ లాగే పనిచేస్తుంది. లిథియం వాడకుండా కేవలం ఇనుమును పరమాణు స్థాయిలో మార్పు చేయడం ద్వారా ఈ అద్భుతాన్ని సాధించారు.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా బ్యాటరీ రంగం చైనా కనుసన్నల్లోనే నడుస్తోంది. 2025 నాటికి ప్రపంచంలోని 80% లిథియం-అయాన్ బ్యాటరీలను చైనానే ఉత్పత్తి చేస్తోంది. ఎనర్జీ స్టోరేజ్ మార్కెట్‌లో 90% వాటా ఆ దేశానిదే. లిథియం ధరలు పెరగడం, దాని వెలికితీత పర్యావరణానికి హాని కలిగించడంతో ప్రత్యామ్నాయాల కోసం ప్రపంచం వెతుకుతోంది. లిథియం బ్యాటరీలు కేవలం 4 గంటల వరకు మాత్రమే ఛార్జింగ్‌ను సమర్థవంతంగా నిల్వ చేయగలవు.

కానీ సౌర, పవన విద్యుత్ వంటి ప్రకృతి వనరుల నుండి వచ్చే శక్తిని భారీ స్థాయిలో, ఎక్కువ కాలం నిల్వ చేయడానికి ఈ కొత్త ఐరన్ బ్యాటరీలే సరైన పరిష్కారమని నిపుణులు భావిస్తున్నారు. ఇనుము చౌకగా లభించడం వల్ల బ్యాటరీల ధరలు భారీగా తగ్గి, సామాన్యులకు సైతం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. క్వాంటం బ్యాటరీల నుండి మట్టి బ్యాటరీల వరకు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రయోగాలు జరుగుతున్నప్పటికీ, చైనా మాత్రం క్లీన్ ఎనర్జీ కోసం భారీగా ఖర్చు చేస్తూ అందరికంటే ముందు వరుసలో నిలుస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>