ఐపీఎల్ ‘ఇంపాక్ట్ ప్లేయర్’ రూల్‌పై రగడ!

కలం, స్పోర్ట్స్ : ఐపీఎల్ (IPL 2026) 19వ సీజన్ ప్రారంభానికి ముందే ‘ఇంపాక్ట్ సబ్’ (Impact Sub Rule) నిబంధనపై వివాదం ముదిరింది. ముంబైలోని బీసీసీఐ (BCCI) ప్రధాన కార్యాలయంలో జరిగిన కెప్టెన్ల సమావేశంలో పది జట్ల సారథులు ఈ రూల్‌పై తమ అసంతృప్తిని వెల్లడించారు. ఈ నిబంధన వల్ల ఆట స్వరూపం మారుతోందన్నారు. 2023లో ప్రవేశపెట్టిన ఈ రూల్ ప్రకారం, మ్యాచ్ మధ్యలో ఏ సమయంలోనైనా ఒక ఆటగాడి స్థానంలో మరొకరిని తీసుకునే అవకాశం ఉంటుంది. జట్లు తమ అవసరాన్ని బట్టి బ్యాటర్‌కు బదులు బౌలర్‌ను లేదా బౌలర్‌కు బదులు బ్యాటర్‌ను వాడుకుంటున్నాయి. దీనివల్ల జట్టులో ఆల్‌రౌండర్ల ప్రాధాన్యత తగ్గిపోతోందని కెప్టెన్లు ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా యువ ఆల్‌రౌండర్ల ఎదుగుదలపై ఇది ప్రతికూల ప్రభావం చూపుతుందని వారు బోర్డు దృష్టికి తీసుకెళ్లారు. గతంలో జరిగిన సమావేశంలోనూ ఒక సీనియర్ కెప్టెన్ దీనిపై అభ్యంతరం తెలపగా, మిగిలిన వారంతా అతనికి మద్దతు పలికారు.

అయితే ఈ నిబంధన వల్ల ఒక ప్రయోజనం కూడా ఉంది. ప్రతి మ్యాచ్‌లో అదనంగా ఒక భారతీయ ఆటగాడికి ఆడే అవకాశం దక్కుతోంది. విదేశీ ప్లేయర్ల కోటా పరిమితి కారణంగా, జట్లు ఎక్కువగా భారత ఆటగాళ్లనే ఇంపాక్ట్ సబ్‌లుగా ఎంపిక చేస్తున్నాయి. కెప్టెన్ల నుంచి వ్యతిరేకత వచ్చినప్పటికీ, బీసీసీఐ మాత్రం తన నిర్ణయానికే మొగ్గు చూపింది. ప్రస్తుతానికి ఈ నిబంధనలో ఎలాంటి మార్పులు ఉండవని స్పష్టం చేసింది. 2027 ఐపీఎల్ (IPL) సీజన్ ముగిసిన తర్వాతే ఈ రూల్‌పై మళ్లీ సమీక్ష జరుపుతామని అధికారులు తేల్చి చెప్పారు.

Read Also: క్యూలో నిలబడలేం.. IPL వీఐపీ టికెట్లు కావాలి : కాంగ్రెస్ ఎమ్మెల్యే

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>