ఎన్నికల రాష్ట్రాల్లో డ్రగ్స్.. ఇంత భారీగా ఇదే ఫస్ట్ టైమ్ !

కలం, వెబ్ డెస్క్ : దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల నగారా మోగిన సంగతి తెలిసిందే. తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ ను ఎన్నికల సంఘం రిలీజ్ చేసింది. ఏప్రిల్​ లో రెండు దఫాలుగా ఈ ఎన్నికలు జరగనుండగా.. ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో ప్రలోభాల పర్వం కొనసాగుతోంది. ముఖ్యంగా ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో మద్యం, డ్రగ్స్ ప్రవాహం భారీగా పెరుగుతుంది. ఈ మేరకు ఎన్నికల సంఘం నిఘా వర్గాలు, పోలీసులు జరిపిన విస్తృత తనిఖీల్లో ఆయా రాష్ట్రాల్లో భారీగా డ్రగ్స్ (Drug Seizures), మద్యం, నగదు, విలువైన లోహాలు పట్టుబడ్డాయి.

ఐదు రాష్ట్రాల్లో జరిగిన తనిఖీల్లో ఇప్పటివరకు మొత్తం రూ.408.82 కోట్ల విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. నిఘా వర్గాలు ఇచ్చిన సమాచారంతో జరిగిన తనిఖీల్లో ఏకంగా రూ.167.38 కోట్ల విలువైన డ్రగ్స్‌ను పట్టుకున్నారు. ఎన్నిక జరిగే రాష్ట్రాలలో ఇంత భారీ మొత్తంలో డ్రగ్స్ పట్టుబడడం (Drug Seizures) ఇదే తొలిసారి. అలాగే రూ.37.68 కోట్ల విలువైన మద్యం, రూ.17.44 కోట్ల నగదు, రూ.23 కోట్ల విలువైన విలువైన లోహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఎన్నికలు జరుగుతున్న డ్రగ్స్ తో పాటు అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ఎన్నికల సంఘం కఠిన చర్యలు చేపడుతోంది. అక్రమ రవాణాకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్నికల సంఘం హెచ్చరిస్తోంది. ఎన్నికల సంఘం అధికారులతో పాటు, పోలీసులు, నిఘా వర్గాలు విస్తృత తనిఖీలు చేపడుతున్నారు. అనుమానిత వాహనాలు, ప్రాంతాల్లో తనిఖీలను ముమ్మరం చేస్తున్నారు.

Read Also: ఐపీఎల్‌-2026 రెండో షెడ్యూల్‌ విడుదల

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>