కలం, వెబ్ డెస్క్ : ఐపీఎల్ (IPL) 2026 సీజన్ ప్రారంభం అవుతున్న వేళ కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. పాస్ లకు అర్హత ఉన్నప్పటికీ ఎమ్మెల్యేలు, మంత్రులను క్యూలలో నిలబడాలని లేదా అధిక ధరలకు టికెట్లు (Tickets) కొనాలని బలవంతం చేస్తున్నారని ఎమ్మెల్యే కాశప్పనపర్ విజయానంద శివశంకరప్ప అన్నారు. మేం వీవీఐపీలం.. ప్రతి ఎమ్మెల్యేకు, మంత్రికి 5 వీఐపీ టికెట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలకు కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ టికెట్లు ఇవ్వడం లేదని.. భారీగా బ్లాక్ మార్కెటింగ్ చేస్తోందని తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ స్పీకర్ జోక్యం చేసుకుని, ఎమ్మెల్యేలకు వీఐపీ టిక్కెట్లు అందేలా చూడాలని కోరారు. ప్రభుత్వం నుంచి లాభపడుతూ ప్రజాప్రతినిధులకే టికెట్లు ఇవ్వడం లేదని విమర్శించారు.

