కలం, వెబ్ డెస్క్ : రాష్ట్రంలో నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) కేబినెట్ సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. 2029 నాటికి రాష్ట్రంలో నియోజకవర్గాల సంఖ్య సుమారు 50 శాతం పెరిగే అవకాశముందని వెల్లడించారు.
పునర్విభజనతో రాజకీయ అవకాశాలు విస్తృతంగా పెరుగుతాయని సీఎం పేర్కొన్నారు. ఈ అంశంపై ప్రజలకు అవగాహన కల్పించాలని మంత్రులకు సూచించారు. బడ్జెట్ విషయానికొస్తే, రాష్ట్ర బడ్జెట్‌లో సుమారు 90 శాతం నిధులు ఉద్యోగుల జీతాలకే వెళ్తున్నాయని చంద్రబాబు (Chandrababu) తెలిపారు. కేంద్రం నుంచి వచ్చే సాయం ఎక్కువగా వడ్డీల చెల్లింపులకు సరిపోతున్నప్పటికీ, సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల్లో ఎలాంటి తగ్గుదల ఉండదని స్పష్టం చేశారు.
బడ్జెట్ లబ్ధిని ప్రజలకు వివరించడంలో ఇంచార్జ్ మంత్రులు బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు. ఇక రాజధాని అమరావతి (Amaravati) అంశంపై మాట్లాడుతూ, ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే అమరావతికి చట్టబద్ధత కల్పించే సవరణ బిల్లు ప్రవేశపెట్టే అవకాశముందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు.
Read Also: క్యూలో నిలబడలేం.. IPL వీఐపీ టికెట్లు కావాలి : కాంగ్రెస్ ఎమ్మెల్యే
Follow Us On: X(Twitter)

