ఐపీఎల్ మూడో పోరుకు వేదిక సిద్ధం.. చెన్నైని రాజస్థాన్ ఆపగలదా!

క‌లం, వెబ్ డెస్క్‌: ఐపీఎల్ 2026లో మరో బిగ్ ఫైట్‌కు సమయం ఆసన్నమైంది. గౌహతిలోని బరస్‌పరా స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals), చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) జట్లు తలపడనున్నాయి. గత సీజన్ చేదు జ్ఞాపకాలను చెరిపేసి, గెలుపు బాట పట్టాలని ఇరు జట్లు కసితో ఉన్నాయి. గత సీజన్‌లో తొమ్మిదో స్థానానికి పరిమితమైన రాజస్థాన్ రాయల్స్, ఈసారి సరికొత్త ఉత్సాహంతో కనిపిస్తోంది. ముఖ్యంగా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా జట్టులోకి రావడంతో రాయల్స్ బలం పెరిగింది. రియాన్ పరాగ్ నాయకత్వంలోని రాజస్థాన్ జట్టు, తమ హోమ్ గ్రౌండ్‌లో చెన్నైని కట్టడి చేయాలని పట్టుదలతో ఉంది.

మరోవైపు, ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్‌కు ఈ మ్యాచ్‌కు ముందే పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. పిక్క కండరాల గాయం కారణంగా ఆ జట్టు వెన్నెముక ఎంఎస్ ధోనీ రెండు వారాల పాటు ఆటకు దూరమయ్యారు. అయితే, ఇటీవల జట్టులోకి వచ్చిన సంజూ శాంసన్ వికెట్ కీపింగ్ బాధ్యతలు చేపట్టనుండటం విశేషం. రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలో చెన్నై మళ్ళీ పాత వైభవాన్ని చాటాలని చూస్తోంది.

రికార్డులు ఇలా…

గణాంకాలను పరిశీలిస్తే ఇరు జట్లు సమఉజ్జీలుగా కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు జరిగిన 32 మ్యాచ్‌ల్లో చెన్నై 16 సార్లు, రాజస్థాన్ 16 సార్లు విజయం సాధించాయి. అయితే, గత ఏడాది జరిగిన చివరి పోరులో మాత్రం రాజస్థాన్ దే పైచేయిగా నిలిచింది.

పిచ్ రిపోర్ట్…

గౌహతి పిచ్ సాధారణంగా బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. అయితే రాత్రి సమయంలో మంచు (Dew) ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున, టాస్ గెలిచిన జట్టు మొదట బౌలింగ్ ఎంచుకుని, లక్ష్యాన్ని ఛేదించేందుకే మొగ్గు చూపవచ్చు. సగటున ఇక్కడ 150-160 పరుగులు నమోదయ్యే అవకాశం ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>