కలం, వెబ్ డెస్క్: సికింద్రాబాద్ వెస్ట్ మారేడ్‌పల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న ఓ విద్యార్థిని మృతి (Intermediate Student Death) చెందిన ఘటన సంచలనంగా మారింది. అధ్యాపకుల వేధింపుల వల్లే తీవ్ర డిప్రెషన్‌కు గురై చనిపోయిందంటూ కుటుంబసభ్యులు, విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇటీవల విద్యార్థిని శుక్రవారం కాలేజీకి ఆలస్యంగా లెక్చరర్లు ప్రశ్నించినట్టు తెలుస్తోంది. పీరియడ్స్ కారణంగా తాను కాలేజీకి రాలేదని విద్యార్థిని చెప్పగా.. లెక్చరర్లు అవమానంగా మాట్లాడారని.. ‘పీరియడ్స్ వచ్చాయా.. నాటకాలు ఆడుతున్నావా.. ఏది చూపించు’ అంటూ మహిళా లెక్చరర్లు అందరి ముందు గట్టిగా నిలదీయడంతోనే విద్యార్థిని మానసికంగా కుంగిపోయి చనిపోయిందని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే అనారోగ్యంతో విద్యార్థిని చనిపోతే అనవసరంగా రాజకీయం చేస్తున్నారన్న విమర్శలు కూడా వస్తున్నాయి.
లెక్చరర్లు శ్రీలక్ష్మి, మధురిమ వేధింపుల వల్లే విద్యార్థిని చనిపోయిందని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. దురుసుగా ప్రవర్తించడంతో మానసికంగా కుంగిపోయి.. కాలేజ్ నుంచి ఇంటికి వచ్చిన అనంతరం అకస్మాత్తుగా కుప్పకూలిన విద్యార్థిని కుప్పకూలిందని చెబుతున్నారు. మెదడులో బ్లడ్ క్లాట్ అవ్వడం వల్లే విద్యార్థిని మృతి చెందినట్టు డాక్టర్లు చెబుతున్నారు. ఈ ఘటన రాష్ట్రంలో తీవ్ర సంచలనంగా మారింది. అధ్యాపకుల తీరువల్లే విద్యార్థిని చనిపోయిందని.. తీవ్ర మానసిక వేదనకు గురైందని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. వెంటనే లెక్చరర్ల మీద చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

Read Also: కాంగ్రెస్ పనులే చాలు.. మరో పార్టీకి ఛాన్స్ లేదు: భట్టి విక్రమార్క
Follow Us On: X(Twitter)


