Mobile Popup Ad
Mobile Popup Ad

తెలంగాణ రెరా కార్యదర్శిగా కే శ్రీనివాస్ నియామకం

కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (Telangana RERA) నూతన కార్యదర్శిగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) చీఫ్ సిటీ ప్లానర్ (CCP) కే. శ్రీనివాస్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ ఉత్తర్వులు జారీ చేశారు.

ఇప్పటివరకు జీహెచ్ఎంసీ సీసీపీగా సేవలందించిన శ్రీనివాస్, నగరంలో జీహెచ్ఎంసీ డివిజన్ల పునర్విభజన ప్రక్రియలో అత్యంత కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు ఆయన బదిలీ కావడంతో, ఖాళీ అయిన జీహెచ్ఎంసీ సీసీపీ స్థానంలో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (HMDA) డైరెక్టర్ ఎం. భవాణీరాణిని ప్రభుత్వం నియమించింది. మున్సిపల్ పరిపాలనలో కీలకమైన ఈ బదిలీలు తక్షణమే అమలులోకి రానున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>