బాన్సువాడ ఎస్సీ హాస్టల్‌లో విద్యార్థిని సూసైడ్‌!

కలం, నిజామాబాద్ బ్యూరో: కామారెడ్డి (Kamareddy) జిల్లాలోని బాన్సువాడ (Banswada)లో తీవ్ర విషాద‌క‌ర ఘ‌ట‌న చోటు చేసుకుంది. స్థానిక‌ టీచర్స్ కాలనీలో ఉన్న‌ ప్రభుత్వ ఎస్సీ బాలికల వసతి గృహం (SC Girls Hostel)లో అమృత అనే బైపీసీ ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థిని హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అమృత స్వ‌స్థ‌లం డొంగ్లీ మండలం లక్ష్మాపూర్ గ్రామం. విద్యార్థిని ఆత్మ‌హ‌త్య‌పై స‌మాచారం తెలుసుకున్న‌ డీఎస్పీ సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

ఈ క్ర‌మంలో విద్యార్థి సంఘాలు, బీఆర్ఎస్ నాయకులు, విద్యార్థిని త‌ల్లిదండ్రులు హాస్టల్ నుండి డెడ్ బాడీని తరలించకుండా అడ్డుకున్నారు. అమృత మృతికి గల కారణాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు. హాస్టల్ వార్డెన్ కూడా చాలా రోజుల నుండి రావడం లేదని, ఆమెను సస్పెండ్ చేయాలని ఆందోళనకు దిగారు. దీంతో హాస్ట‌ల్ వ‌ద్ద‌ ఉద్రిక్తత చోటుచేసుకుంది. కొద్ది సేప‌టి త‌ర్వాత‌ మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. విచారణ జరిపి న్యాయం చేస్తామని ఆర్డీఓ రవీందర్ రెడ్డి విద్యార్థిని తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు.

Read Also: ‘వివరణ ఇచ్చేదే లేదు’.. మంత్రి సురేఖకు కడియం కౌంటర్!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>