ఇందూరు యువత సేవా కార్యక్రమాలపై కార్యాచరణ

కలం, నిజామాబాద్ బ్యూరో : నిజామాబాద్ (Nizamabad) లోని ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ కార్యాలయంలో బుధవారం కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రతి నెల నిర్వహించే సేవా కార్యక్రమాలకు సంబంధించి నిత్య అన్నదాన కార్యక్రమం, గోసేవ, అనాథ శవాలకు అంత్యక్రియలు అభాగ్యుల సపర్య సేవలు వంటి కార్యక్రమాలు కార్యాచరణపై చర్చించారు. అలాగే భవిష్యత్ కార్యచరణ ప్రణాళికపైన కార్యవర్గం వారి వారి ఆలోచనలను సలహాలను అందచేయ్యటం జరిగింది. రైస్ బ్యాగ్స్ చాలెంజ్ కార్యక్రమాలను నిర్వహించాలని చర్చించారు. ఈ సమావేశంలో ఇందూరు యువత స్వచ్ఛంద సేవ సంస్థ అధ్యక్షులు మద్దుకూరి సాయిబాబు, ప్రధాన కార్యదర్శి వాల బాలకిషన్, జాయింట్ సెక్రటరీ రాజేష్ శర్మ, ఈ.సి మెంబర్ మద్ది గంగాధర్, సుజాత రెడ్డి, కొండా నాగేందర్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>