కర్ణాటకలో గురు భైరవైక్య మందిరం ప్రారంభించిన ప్రధాని మోదీ

కలం, వెబ్ డెస్క్ :  కర్ణాటక (Karnataka) రాష్ట్రంలోని మండ్య జిల్లా ఆదిచుంచనగిరిలో శ్రీ గురు భైరవైక్య మందిరాన్ని(Guru Bhairavaikya Mandira) ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రముఖ ఆధ్యాత్మిక గురువు శ్రీ శ్రీ శ్రీ డా. బాలగంగాధరణాథ మహాస్వామీజీకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ (PM Modi) మాట్లాడుతూ భారత్ వేల ఏళ్లుగా కొనసాగుతున్న గొప్ప నాగరికత అని పేర్కొన్నారు. ఆధ్యాత్మిక గురువులు కేవలం ధర్మబోధకులుగా మాత్రమే కాకుండా సమాజంలో ప్రజలతో కలిసి జీవించి వారి కష్టసుఖాలను అర్థం చేసుకుని మార్గనిర్దేశం చేశారని చెప్పారు.

కొత్తగా నిర్మించిన మందిరం కేవలం ఒక భవనం కాదని, అది భక్తి, సేవ, సంప్రదాయాల ప్రతీకగా నిలుస్తుందని మోదీ అన్నారు. భవిష్యత్ తరాలకు ఇది స్ఫూర్తినిస్తుందని తెలిపారు. కర్ణాటకను సంప్రదాయం, సాంకేతికత కలయికగా అభివర్ణించిన ప్రధాని, ఆదిచుంచనగిరి మఠం వంటి సంస్థలు సమాజానికి ఆధ్యాత్మిక మార్గదర్శకంగా పనిచేస్తాయని తెలిపారు. ఈ సందర్భంగా దేశ ప్రజలకు దేశాభివృద్ధి కోసం తొమ్మిది ముఖ్య సూచనలు చేశారు

తొమ్మిది ముఖ్య సూచనలు
  •  నీటి సంరక్షణపై దృష్టి పెట్టాలి
  • చెట్లు నాటాలి, ప్రకృతిని కాపాడాలి
  •  పరిశుభ్రతను పాటించాలి
  • స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాలి
  • దేశీయ పర్యాటకాన్ని పెంపొందించాలి
  •  సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి
  •  ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి
  •  యోగా, క్రీడలను జీవితంలో భాగం చేసుకోవాలి
  • సేవాభావంతో ముందుకు రావాలి

ఈ విలువలను అనుసరిస్తే  దేశం వేగంగా అభివృద్ధి దిశగా సాగుతుందని ప్రధాని విశ్వాసం వ్యక్తం చేశారు. సమిష్టి కృషితో ‘వికసిత భారత్’ లక్ష్యాన్ని సాధించవచ్చని పిలుపునిచ్చారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>