కలం, వెబ్ డెస్క్ : ఇండోనేషియాలో సభ్య సమాజం తలదించుకునేలా ఒక షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. అమ్మానాన్నలు నమ్మి వదిలివెళ్లిన పసిపిల్లలపై యోగ్యకర్త డేకేర్ సెంటర్ నిర్వాహకులు అత్యంత క్రూరంగా (Indonesia Daycare Abuse) వ్యవహరించారు. సిబ్బంది పిల్లలు ఏడవకుండా ఉండటానికి వారి నోట్లో బలవంతంగా గుడ్డలు కుక్కడం, కాళ్లు చేతులు కట్టేసి పక్కన పడేయడం వంటి అమానవీయ చర్యలకు దిగారు.
ఈ మేరకు సదరు డేకేర్ సెంటర్ పై వస్తున్న ఆరోపణలపై రంగంలోకి దిగిన పోలీసులు.. అందులోని 103 మంది పిల్లల్లో దాదాపు 53 మంది చిన్నారులు సిబ్బంది చేతుల్లో ఘోరమైన హింసకు గురైనట్లు తేల్చారు. దీంతో పోలీసులు 13 మందిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. పసిపిల్లల పట్ల కనీసం జాలి లేకుండా సిబ్బంది ప్రవరించిన తీరుపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. బాధితుల తల్లిదండ్రులు ఈ విషయం తెలిసి కన్నీరుమున్నీరవుతున్నారు. నిందితులను వదలిపెట్టవద్దని కోరుతున్నారు. చిన్నారులపై అమానుషంగా వ్యవహరించిన సిబ్బందికి మరణ శిక్ష విధించాలని తల్లిదండ్రులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
Read Also: సోదరి అస్థిపంజరంతో బ్యాంక్‌కు.. ఎందుకో తెలుసా ?
Follow Us On: Sharechat

